Kishan Reddy: కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
ABN, First Publish Date - 2023-11-17T17:52:28+05:30
కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.
హైదరాబాద్: కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగ సభలు పెడతాం. ఈ సభలల్లో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను అగ్ర నాయకులు ప్రజలకు వివరిస్తారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తాం. బీజేపీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ తీసుకెళ్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు. ఆత్మబలిదానాలపై చిదంబరం కామెంట్స్ విచిత్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు. 1969లో 369మందిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రచారాన్ని ఉధృతం చేస్తాం
‘‘రానున్న వారం రోజులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, యోగీ, హిమంత బిశ్వశర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ గ్రామ, మండల శాఖలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలి. రేపు ఉదయం 11గంటలకు అమిత్ షా గద్వాల ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండలో అమిత్ షా ప్రచార సభలో ప్రసగింస్తారు. 2.30గంటలకు వరంగల్ బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ చేరుకంటారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-11-17T18:08:10+05:30 IST