ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మావోయిస్టు పార్టీ నేత ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-12-10T22:52:47+05:30

తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈమేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను ఆదివారం నాడు విడుదల చేసింది.

వరంగల్ : తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈమేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను ఆదివారం నాడు విడుదల చేసింది. లేఖలో ఏముందంటే.. ‘‘నిరంకుశ, నియంతృత్వ బీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు చెత్తబుట్టలో విసిరికొట్టారు. బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేయాలి. ప్రజలే పాలకులు, మేము సేవకులం, అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు ప్రజలను నమ్మించేందుకు వాడిన పడికట్టు పదాలే. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీములకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు...? ప్రజలపై మరింత భారం మోపుతారు... లేదంటే ప్రజా ఆస్తులను తెగనమ్ముతారు. ప్రజా సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారం ప్రజల రాజ్యాధికారం మాత్రమే’’ అని లేఖలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T22:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising