TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి
ABN, First Publish Date - 2023-11-27T23:42:50+05:30
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
హైదారాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. 15 వేల రూపాయలతో పాటు ఐఫోన్‌ని లాక్కుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన వారు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Updated Date - 2023-11-27T23:42:56+05:30 IST