ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR Nomination: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన కేటీఆర్

ABN, First Publish Date - 2023-11-09T10:53:20+05:30

బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఈరోజు (గురువారం) నామినేషన్ వేయనున్నారు.

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఈరోజు (గురువారం) నామినేషన్ వేయనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ (Minister KTR) సిరిసిల్లలో నేడు నామినేషన్ వేస్తారు. నామినేషన్‌ వేసేందుకు కేటీఆర్‌ గురువారం ఉదయం సిరిసిల్లకు బయలుదేరారు. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్‌లో పూజ నిర్వహించారు. కేటీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్‌ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.


మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) కూడా ఈరోజు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. సాయంత్రం 4గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే మంత్రి హరీష్‌రావు (Minister Harish rao) కూడా నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Updated Date - 2023-11-09T10:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising