ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: తెలంగాణపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-11-16T16:52:54+05:30

కేంద్ర మాజీమంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదనే ఆందోళనతో యువకులు బలిదానం చేశారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు ఏమన్నారంటే.. ‘‘చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉంది. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదనే ఆందోళనతో యువకులు బలిదానం చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదు ..చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారు. అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణను అభివృద్ధి చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు. ఈ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నారు’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated Date - 2023-11-16T16:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising