ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Srinivas Goud: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 90కి పైగా స్థానాలు గెలవబోతుంది

ABN, First Publish Date - 2023-10-29T22:08:44+05:30

బీజేపీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా గెలవదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.

హైదరాబాద్: బీజేపీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా గెలవదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు. ఆదివారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘బీసీ ప్రధానమంత్రి కాగానే మా వర్గాలకు మేలు జరుగుతుందని అనుకున్నాం. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తారంటే ఎలా నమ్మాలి. బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ బీజేపీ పార్టీ బీసీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. శాసనమండలిలో బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాం. ఇద్దరు బీసీ బిడ్డలకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా బీజేపీ అడ్డుకున్నది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుంది. గెలవని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సీట్లు ఇస్తుంది. వ్యవసాయం దండుగ అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్నాయి. బీసీలపై బీజేపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.

Updated Date - 2023-10-29T22:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising