ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Kavitha: టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం

ABN, First Publish Date - 2023-12-07T20:41:26+05:30

సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) స్పష్టం చేశారు.

హైదరాబాద్ : సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కార్మికుల హక్కలు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదని కవిత చెప్పారు. గనులల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని కాబట్టి ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా పనిచేయాలని కవిత అన్నారు. మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, అతి త్వరలో తమ సంఘం మేనిఫెస్టోను విడుదల చేస్తుందని కవిత ప్రకటించారు.


ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని, భవిష్యత్తులోనూ సంఘాలను సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయలేవన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండగా ఒక్క సమ్మె కూడా చేసే అవసరం లేకుండా అన్ని పనులను సాధించి పెట్టామని కవిత తెలిపారు. సింగరేణి అంటే తమకు ప్రాధాన్యత ఉందని, కానీ కాంగ్రెస్ ప్రాధాన్యతల్లో సింగరేణి, ఆ సంస్థ కార్మికులు లేరని తేల్చిచెప్పారు. ఏ అధికారం లేనప్పుడే తెలంగాణ సాధించామని, అలాంటిది కార్మికుల హక్కులు, ప్రయోజనాలు సాధించడానికి సింగరేణి సంస్థ యాజమన్యాన్ని నిద్రపోనివ్వబోమని తెలిపారు. తమకు పోరాటాలు కొత్తకాదని, కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించబోమని, కార్మికుల పక్షాన ప్రతి నిత్యం నిలబడి ఉంటామని కవిత పునరుద్ఘాటించారు.


సింగరేణి సంస్థలో దాదాపు 40 వేల ఉద్యోగులు ఉంటే 21 వేల వరకు యువకులు ఉన్నారని ప్రస్తావించారు. కాబట్టి సంఘం నాయకత్వ బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామని, యువతను సింగరేణిని నడపడంలో చోదక శక్తిగా తీర్చిదిద్దుతామని కవిత చెప్పారు. అన్ని కమిటీల్లోనూ యువతకు సరైన ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తామని కవిత పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొంత మంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అధికారులు కుదరదని చెప్పినా సరే కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టారని కవిత వివరించారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాకుండా ఆత్మగౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సింగరేణి పనితీరును మెరుగుపర్చడానికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ చేసిన మంచి పనులను కార్మికుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా వివరిస్తే టీబీజీకేఎస్‌కు ఎదురుండదని కవిత వెల్లడించారు.

Updated Date - 2023-12-07T20:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising