ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IT Raids : తెలంగాణలో మళ్లీ మొదలైన ఐటీ సోదాలు.. ఈసారి ఏ పార్టీ నేత నివాసంపైనంటే..

ABN, First Publish Date - 2023-11-16T10:15:05+05:30

తెలంగాణలో ఐటీ సోదాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో ఐటీ సోదాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 40 బృందాలతో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో అధికారులు రైడ్ చేశారు. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు పాల్గొన్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు నిల్వ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. నల్లమోతు భాస్కరరావుకి దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నాయి. పలు పవర్ ప్లాంట్లలో దేశ వ్యాప్తంగా నల్లమోతు భాస్కరరావు పెట్టుబడులు పెట్టారు.

విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు నివాసంలోనూ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు స్వయానా శ్రీనివాసరావు మేనల్లుడు. ప్రస్తుతానికి ఆర్‌సీ పురం విజిలెన్స్ ఎస్పీగా కొనసాగుతున్నారు. అలాగే రామ్ శ్రీ ఇన్ఫ్రా టెక్, వీఐకే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వీరి కార్యాలయంలో డబ్బులు నిల్వ చేసినట్టు ఆరోపణలు రావడంతో సోదాలు జరుగుతున్నాయి.

Updated Date - 2023-11-16T10:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising