Congress: పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై వీడిన సస్పెన్స్..
ABN, First Publish Date - 2023-11-15T14:54:35+05:30
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్‌రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుజ్జగింపులు ఫలించాయి.
సూర్యాపేట: సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి (Congress rebel candidate Patel Ramesh Reddy) నామినేషన్ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్‌రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి (AICC Secretary Rohit Chaudhary), సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి Senior Vice President Mallu Ravi) బుజ్జగింపులు ఫలించాయి. పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో దాదాపు రెండు గంటలకుపైగా సీనియర్ కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఎలాగైన పటేల్‌ను పోటీ నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు వారి బుజ్జగింపులు ఫలించి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రమేష్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ హామీ లభించినట్లు సమాచారం. స్వయంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (AICC General Secretary KC Venugopal) మాట్లాడటంతో నామినేషన్ ఉపసంహరణకు పటేల్ బయల్దేరారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్లు రవిపై ఎటాక్...
కాగా.. పటేల్ రమేష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడాన్ని ఆయన అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. నామినేషన్ ఉపసంహరించేలా చేశారని ఆగ్రహంతో సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవిపై దాడికి పటేల్ అభిమానులు యత్నించారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది.
Updated Date - 2023-11-15T14:54:36+05:30 IST