ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanka Gandhi: బీఆర్ఎస్, బీజేపీ సర్కార్లపై ప్రియాంక గాంధీ ఫైర్

ABN, First Publish Date - 2023-11-24T17:00:58+05:30

హుస్నాబాద్ కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

సిద్దిపేట: హుస్నాబాద్ కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కష్టపడి చదివితే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు


"ఎన్నికల సమయం, అందరం ఆలోచించాల్సిన సమయం. నాయకులు ఎలాంటి వారో ప్రజలు ఆలోచించాలి. 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఇచ్చాం. ఇక్కడ పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసు. మీ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ గురించి అందరం ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ ఓటు ఎంతో కీలకం. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలి. పదేళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదు. కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్ష రాస్తే పేపర్ లీకులు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై దుష్ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం చీకటిలోకి తీసుకెళ్తుంది. యువత దేశానికి పట్టుకొమ్మలు." అని ప్రియాంక గాంధీ చెప్పారు.

Updated Date - 2023-11-24T17:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising