ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Renuka Choudhary: అధికార మదంతో కేసీఆర్ విర్రవిగుతున్నారు

ABN, First Publish Date - 2023-11-02T16:53:27+05:30

అధికార మదంతో కేసీఆర్ (KCR ) విర్రవిగుతున్నారని మాజీకేంద్ర మంత్రి రేణుకాచౌదరి ( Renuka Choudhary ) అన్నారు.

హైదరాబాద్ : అధికార మదంతో కేసీఆర్ (KCR ) విర్రవిగుతున్నారని మాజీకేంద్ర మంత్రి రేణుకాచౌదరి ( Renuka Choudhary ) అన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ...‘‘రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదు. ప్రతి మనిషిపై BRS పార్టీ లక్షకు పైగా అప్పు భారం వేసింది. దొంగ విత్తనాలు మూలంగా 8 వేల మంది రైతు కుటుంబాల నాశనం అయితే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి. ఈ ప్రభుత్వం కౌలు రైతుని మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు దృష్టిలో పెట్టుకుంది. కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఇంటికి చేరింది. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిపిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? మీపార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏం అయింది. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి...? పక్కన ఊరు ప్రజల గురించి ఆలోచించారా...? పంటకు రేట్లు ఆడిగితే జైలు శిక్షలు ..నాలల్లో నీళ్లు రాని పరిస్థితి. కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఎందుకు పనిచేయటం లేదు.. ఈ పోర్టల్ సామాన్యుడికి మేలు జరిగిందా ఆలోచించాలి. కేజీ టూ పీజీ అన్నారు.. BRS నేతలు చదువుకుంటే బాగుండేది. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని చెంపలు వేసుకో కేసీఆర్’’ అని రేణుకా చౌదరి ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-02T16:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising