ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS POLLS: సీఈఓ వికాస్‌రాజ్‌ని కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

ABN, First Publish Date - 2023-11-27T16:49:08+05:30

సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) ని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. సోమవారం నాడు వికాస్‌రాజ్‌ని కలిసిన వారిలో ఎస్టీయూ ప్రెసిడెంట్ సదానందంగౌడ్ , పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు ఉన్నారు.

హైదరాబాద్: సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) ని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. సోమవారం నాడు వికాస్‌రాజ్‌ని కలిసిన వారిలో ఎస్టీయూ ప్రెసిడెంట్ సదానందంగౌడ్ , పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులకు సరిగ్గా పోస్టల్ బ్యాలెట్ అందలేదని తెలిపారు. కేవలం 50 శాతం వరకు మాత్రమే ఓటు హక్కు వినియోగానికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అందాయని.. మిగతా వారికి పోస్టల్ బ్యాలెట్ అందలేదని చెప్పారు.

మెదక్, నల్గొండతో పాటు చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు అందలేదన్నారు. ఓటు విలువ తెలిపే మాకే ఓటు వేసే అవకాశం ఇవ్వడం లేదన్నారు. 28వ తేదీ వరకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ అందిచి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సీఈఓ హామీ ఇచ్చారు. ఓటింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాలల్లో డ్యూటీ చేస్తాం.. కాబట్టి ఇందులో మహిళలు ఉన్నారు కనుక తర్వాత రోజు సెలవ్ ఇవ్వాలని సీఈఓని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T18:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising