ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్ ఏ కాలేజీలో చదివారంటే..!

ABN, First Publish Date - 2023-12-07T11:58:56+05:30

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో

కవాడిగూడ, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో దోమలగూడ ఏవీ కళాశాలలో బీఏఈపీపీ గ్రూప్‌లో చేరారు. మూడేళ్లపాటు ఇదే కళాశాలలో చదివారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యారంగ సమస్యలపై పోరాటం చేశారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

ధర్నా చౌక్‌తో సంబంధం

కేసీఆర్‌ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను నిషేధించిన తర్వాత దానిని తెరిపించడానికి అనేక పోరాటాలలో భాగస్వాములైన రేవంత్‌రెడ్డికి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ జరిగిన అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులు, నిరుద్యోగుల సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చలో సెక్రటేరియట్‌, చలో అంసెబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-12-07T11:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising