ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections : వామ్మో.. గెలుపుపై కాంగ్రెస్ లెక్కలు మాములుగా లేవుగా.. ఓ లుక్కేయండి!

ABN, First Publish Date - 2023-12-01T15:02:17+05:30

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. ఈసారి 70కు పైగా

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. ఈసారి 70కు పైగా ఓటింగ్ శాతం నమోదైంది. అర్బన్ ఏరియాలో ఓటర్లు బద్దకించినా.. రూరల్‌లో మాత్రం పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. గ్రామీణ వాసులు చైతన్యం పొంది ఓటు వేశారు. ఇక చిన్నపాటి ఘర్షణలు తప్పా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పోలీసులు, అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు.

అనుకున్నదొక్కటి..!

తెలంగాణలో ఓటర్ల తీర్పుపై తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ఈసారి మాత్రం తెలంగాణలో ఎవరు గెలుస్తారన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కూడా కాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంచనాలు తారుమారు కావడంతో ఒక విధమైన ఆందోళన మొదలైంది. పైకి గాంభీర్యంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నా.. లోలోపల మాత్రం తెలియని టెన్షన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్.. కాంగ్రెస్..!

ఇక దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఈసారి హస్తం హవా బాగా ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. అర్బన్ ఏరియాలో ఎలాగున్నా... రూరల్‌ ఏరియాలో మాత్రం చాలా బిగ్ ఛేంజ్ కనిపించినట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గాలి బాగా వీచినట్లుగా తేటతెల్లమవుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చెయ్యి పార్టీకి ఊహించని విజయం దక్కొచ్చని సర్వేలు చెప్పుకొస్తున్నాయి.

ఇదే కాంగ్రెస్ ధీమా..!

అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఈసారి ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్ల గెలుపొందుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంత ఓటర్లతో పాటు నిరుద్యోగులు, కొత్త ఓటర్లు తమ వైపే ఉన్నారని అంచనాకు వస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ శివార్లలో కూడా కాంగ్రెస్‌కే భారీగా పోలింగ్ నమోదైందని అంచనా వేస్తోంది.

ఒక వైపు.. ఎగ్జిట్ పోల్స్.. మరోవైపు రూరల్ ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ భావిస్తోంది. మరీ ఎవరు రాజు.. ఎవరు రాణినో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సి ఉంది. ప్రజల నాడీ ఎటువైపు ఉందో.. కౌంటింగ్ ప్రారంభమైన 2, 3 గంటలకు తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా అన్నది మరికొన్ని గంటల్లోనే క్లియర్ కట్‌గా తెలిసిపోనుంది.

Updated Date - 2023-12-01T15:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising