ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Govt: గత ప్రభుత్వ సలహాదారులను తొలగించిన రేవంత్ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-12-09T16:15:02+05:30

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పలు మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పలు మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు స్పెషల్ ఆపీసర్లను కూడా రేవంత్ ప్రభుత్వం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రేవంత్ ప్రభుత్వం తొలగించింది వీరినే...

1. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్

2. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ

3.సాంస్కృతిక, దేవాదాయ సలహాదారు కేవీ రమణాచారి(రీసెంట్ రిజైన్)

4.ప్రభుత్వ ప్రధాన సలహాదారు చెన్నమనేని రమేష్‌

5. హోంశాఖ సలహాదారు అనురాగ్ శర్మ

6.ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్

7. అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారు శోభ

స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఉన్నవారు వీరే..

1.ఇరిగేషన్ అడ్వైజర్ ఎస్కే జోషి

2. ఫైనాన్స్ డిపార్టుమెంట్‌ స్పెషల్ ఆఫీసర్లు జీఆర్‌రెడ్డి, శివశంకర్

3. ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఆఫీసర్లు సుధాకర్ తేజ

4.ఇంధన సెక్టార్‌ స్పెషల్ ఆఫీసర్లు రాజేంద్ర ప్రసాద్ సింగ్

5. ఉద్యాన శాఖ అడ్వైజర్‌ శ్రీనివాస్‌రావు

గత ప్రభుత్వ సలహాదారులతో పాటు స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఉన్న అధికారుల నియామకాలను రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీచేయడంతో వీరంతా ఇప్పుడు ఇంటిదారి పట్టనున్నారు. వీరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్‌, మరి కొంత మంది అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-09T16:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising