ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth: కందిపప్పును తీసుకోండి... గన్నేరుపప్పును కాదు.. కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

ABN, First Publish Date - 2023-11-03T12:42:50+05:30

: మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై (Minister KTR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు’’ అంటూ రేవంత్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.


రేవంత్ ఇంకా మాట్లాడుతూ... 2018లో తెలంగాణ సెంటిమెంట్‌ను నిద్రలేపి కేసీఆర్ (CM KCR) రాజకీయంగా లాభం పొందారన్నారు. 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్‌కు అవకాశం దొరికిందని తెలిపారు. కానీ పదేళ్లలో కేసీఆర్ గుడ్ విల్ సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ (BRS) కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఈ ఎన్నికలు అని చెప్పుకొచ్చారు. బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) బీఆర్‌ఎస్ (BRS) కూటమే అని అన్నారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తీరతారని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-03T12:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising