ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ రియాక్షన్ ఇదే...

ABN, First Publish Date - 2023-11-30T10:34:18+05:30

Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.

వికారాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే అని చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంకున్నామని.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా అని ప్రశ్నించారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవన్నారు. కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదన్నారు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్‌ది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T10:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising