Anurag Thakur: తెలంగాణలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది
ABN, First Publish Date - 2023-11-27T17:22:42+05:30
తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే
సిద్దిపేట జిల్లా: గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో అవినీతి ప్రభుత్వం నడుస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాలు రాక.. యువత ఆందోళన చెందుతుంది. లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఉద్యోగాలు ఇచ్చారా?, దళితబంధు పథకం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడంలో కేసీఆర్ (Cm Kcr) విఫలమయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే తెలంగాణకు విముక్తి లభించింది. నేటి రజాకార్లైన బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ల నుంచి విముక్తి రావాలి.’’ అని ఆకాంక్షించారు.
‘‘తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుంది. డిగ్రీ చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ అందిస్తాం. బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణకు మంజూరు చేశాం.. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని దొచుకునేందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూతురు ఉంది.. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. ఓ వైపు కేసీఆర్.. మరో వైపు హరీష్‌రావు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
దూది శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..
‘‘తొమ్మిదేళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వని దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఇంట్లో నుంచి ఎవ్వరికీ పింఛన్ల ఇవ్వడం లేదు. నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు అడ్డగోలుగా పెంచారు. సిద్దిపేట కౌన్సిలర్లు రాబందులుగా మారారు. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే నేడు ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.’’ అని దూది శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Updated Date - 2023-11-27T17:22:43+05:30 IST