కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

V. Hanumantha Rao: పదేళ్లలో బీఆర్ఎస్ అందరినీ మోసం చేసింది

ABN, First Publish Date - 2023-12-12T17:57:35+05:30

దేళ్లలో బీఆర్ఎస్ ( BRS ) అందరినీ మోసం చేసిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ( V. Hanumantha Rao ) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టింది. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయదని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలి’’ అని వి.హనుమంతరావు పేర్కొన్నారు.

V. Hanumantha Rao: పదేళ్లలో బీఆర్ఎస్ అందరినీ మోసం చేసింది

ఢిల్లీ: పదేళ్లలో బీఆర్ఎస్ ( BRS ) అందరినీ మోసం చేసిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ( V. Hanumantha Rao ) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టింది. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయదని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలి. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది.. ఏమైందని కిషన్ రెడ్డిని అడుగుతున్నాను. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని హామీలు పూర్తి చేస్తాం. ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్నాం’’ అని వి.హనుమంతరావు స్పష్టం చేశారు.

మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్

‘‘మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్. కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసుకుంది. కేవలం ధనవంతులకు మాత్రమే బీఆర్ఎస్ న్యాయం చేసింది. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి అన్నారు కానీ ఇవ్వలేదు.ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేశారు దాన్ని రద్దు చేయాలి. రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయి. ప్రభుత్వం పడిపోతుందనే స్టేట్మెంట్‌పై . బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కామెంట్ చెయొద్దు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు అందుకే సోనియాగాంధీ తెలంగాణ వచ్చారు’’ అని హనుమంతురావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-12T17:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising