YS Sharmila: కేసీఆర్ అంతటి అహంకార సీఎం చరిత్రలో ఎవ్వరూ లేరు
ABN, First Publish Date - 2023-11-25T16:14:25+05:30
Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు... అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?. ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా?’’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్‌పై (Minister KTR) వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి (YSRTP YS Sharmila Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు... అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?. ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా?’’ అని ప్రశ్నించారు. నాడు మహానేత వైయస్ఆర్ రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిస్తే.. క్యాంప్ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను వింటే.. నేడు కేసీఆర్ చేస్తున్నది నియంత పాలన అని విరుచుకుపడ్డారు.
ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు.. దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు అని అన్నారు. అధికార మత్తులో తమకు ప్రజా సమస్యలు కనిపిస్తలేవని.. ఇండ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే కళ్లు కనపడ్తలేవా అని నిలదీశారు. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదన్నారు. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు చెవిన పట్టవని మండిపడ్డారు. సర్కారు బడిలో సౌలతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు కానరావన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారన్నారు. ‘‘మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులే. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరు’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-25T16:23:16+05:30 IST