Bandi Ramesh: బీసీలను అణగదొక్కుతున్న బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలపండి
ABN, First Publish Date - 2023-11-18T10:37:43+05:30
బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని కాంగ్రెస్ కూకట్‌పల్లి అభ్యర్థి బండి రమేష్(Bandi Ramesh) అన్నారు. శుక్రవారం ఉదయం ఓల్డుబోయినపల్లి
- కాంగ్రెస్ కూకట్‌పల్లి అభ్యర్థి బండి రమేష్
ఓల్డు బోయినపల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని కాంగ్రెస్ కూకట్‌పల్లి అభ్యర్థి బండి రమేష్(Bandi Ramesh) అన్నారు. శుక్రవారం ఉదయం ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో సిండికేట్‌బ్యాంక్ కాలనీ, యాదవ్‌బస్తీ, కుమ్మరిబస్తీ, పాతబస్తీ, మల్లికార్జున కాలనీ, బడేగూడకాలనీలో ప్రచారం చేశారు. స్థానిక మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అక్కచెల్లెళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనన్నారు. తాను గెలిచినా.. ఓడినా కాంగ్రెస్‌లో ఉంటూ అక్కచెల్లెళ్లకు అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే అధికార మదంతో బీసీలను అడగదొక్కుతారని మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్న బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలపాలని నియోజకవర్గ ప్రజలకు బండి రమేష్ పిలుపునిచ్చారు. హస్తం గుర్తుకు ఓటువేసి తనను అసెంబ్లీకి పంపిస్తే సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సత్యం శ్రీరంగం, కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్‌రావు, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, అరుణ్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, అశోక్‌శేషు, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.
- కాంగ్రెస్ కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త బండి రమేష్‌ను గెలిపించాలని ఆయన సతీమణి లకుమాదేవి కోరారు. ఓల్డుబోయినపల్లి డివిజన్‌లో పలు బస్తీల్లో మహిళా నాయకులతో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి హస్తం గుర్తుకు ఓటువేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓల్డుబోయినపల్లి శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో భర్త రమే్‌షతో కలిసి ఆమె పాల్గొన్నారు. పీసీసీ మాజీ సభ్యుడు దండుగుల యాదగిరి, మల్లికార్జున్ యాదవ్, మహేందర్, అరుణలత యాదవ్, మనీ్‌షయాదవ్, అశోక్‌కుమార్, హమీద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-18T10:37:44+05:30 IST