ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం

ABN, First Publish Date - 2023-05-04T12:23:40+05:30

పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాలన్నారు. పొంగులేటితో ఈటల బృందం భేటీ విషయమై తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవటం తప్పేమీ కాదన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు. తనకు తెలిసిన వారితో తాను.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు.

నేడు పొంగులేటిని కలవనున్న బీజేపీ చేరికల కమిటి కలవనుంది. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్‌కు నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటి బీజేపీలో చేరటం దాదాపు ఖాయమని అనుచరులు చెబుతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది గత ఆగస్ట్ 21న మునుగోడులో అమిత్ షా బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కమలం పార్టీ గురి పెట్టనుంది. పొంగులేటితో పాటు.. మాజీమంత్రి జూపల్లికి కూడా కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - 2023-05-04T13:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising