ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bibinagar - Guntur: బీబీనగర్‌ - గుంటూరు డబ్లింగ్‌ రైల్వే ప్రాజెక్టుకు మోక్షం

ABN, First Publish Date - 2023-08-17T12:19:43+05:30

బీబీనగర్‌ - (నడికుడి) గుంటూరు జిల్లాల మధ్య రైల్వే డబ్లింగ్‌ లైన్ల కోసం ఎట్టకేలకు మోక్షం లభించింది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

- 239 కిలోమీటర్లు, రూ. 2,853 కోట్లకు పైగా అంచనా

- నల్లగొండ, యాదాద్రి జిల్లాల ప్రయాణికులకు ప్రయోజనం

నల్లగొండ: బీబీనగర్‌ - (నడికుడి) గుంటూరు జిల్లాల మధ్య రైల్వే డబ్లింగ్‌ లైన్ల కోసం ఎట్టకేలకు మోక్షం లభించింది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్‌ పనుల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 239 కిలోమీటర్లకు రూ. 2,853.23 కోట్ల అంచనా వ్యయంతో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్‌ లైన్‌ పూర్తయితే మెరుగైన ప్రయాణంతో పాటు రైళ్ల వేగం పెరగడం రవాణా సౌలభ్యం సులువు కానుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత లైన్‌ సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ కమిటీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. బీబీనగర్‌ - గుంటూరు డబ్లింగ్‌ లైన్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు అదనపు సరుకు రవాణానున సులభతరం చేస్తారు. ఇటీవలే నల్లగొండ జిల్లా తిప్పర్తి నుంచి కర్ణాటక రాష్ట్రానికి రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ డబ్లింగ్‌ పూర్తయితే సమయపాలనతో పాటు వ్యాగన్‌ టర్న్‌ రౌండ్‌ సమయాన్ని మెరుగుపరుస్తుంది. దీని ద్వారా రైళ్ల రద్దీని తగ్గించడానికి, రైళ్ల సంఖ్యను పెంచడానికి కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు. 239 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబ్లింగ్‌ చేయడం వల్ల సుమారు 75 లక్షల మ్యాన్‌డే్‌స వరకు ప్రత్యక్ష ఉపాధిని కూడా కల్పిస్తుంది. బీబీనగర్‌ నుంచి గుంటూరు జిల్లాల వరకు డబ్లింగ్‌ లైన్‌ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ రెండు జిల్లాల వైశాల్యం 23,180.38 చదరపు కిలోమీటర్లు కాగా ఈ జిల్లాలో 1070 గ్రామాలు ఈ రైల్వేలైన్‌ ప్రాజెక్టు సమీపంలో ఉన్నాయి. రైల్వే డబ్లింగ్‌ పనుల సమీపంలో బీబీనగర్‌, నల్లగొండ, నకిరేకల్‌(Bibi Nagar, Nalgonda, Nakirekal), నార్కట్‌పల్లి, భువనగిరి, చిట్యాల, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తనపల్లి, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలు ఈ రెండు తెలుగురాష్ట్రాల్లో ఉండటంతో ఈ రైల్వేలైన్‌ వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు, విజయవాడ(Guntur, Vijayawada) స్టేషన్ల మధ్య రైళ్ల ప్రయాణ సమయం కూడా తగ్గిస్తుంది. బీబీనగర్‌, గుంటూరు సెక్షన్ల డబ్లింగ్‌ వల్ల సెక్షన్ల సామర్థ్యం పెరగడంతో పాటు మరిన్ని గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది.

ప్రధానీ మోదీకి కృతజ్ఞతలు: మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

బీబీనగర్‌ - గుంటూరు జిల్లాల మధ్య డబ్లింగ్‌ లైన్‌ ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలగనున్నాయి. అదేవిధంగా కొత్త రైళ్లు ఏర్పాటు కావడంతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దీంతో పాటు వేగవంతంగా రైళ్ల ప్రయాణం వల్ల సమయం ఆదా కలిగి రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలతో పాటు రైల్వే ప్రయాణికులకు మేలు కలగడం హర్షనీయం.

Updated Date - 2023-08-17T12:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising