ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MAL Etala: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు?

ABN, First Publish Date - 2023-07-23T18:41:43+05:30

తెలంగాణ (Telangana) ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

జలవిహార్: తెలంగాణ (Telangana) ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala) హాజరయ్యారు. ఈ సమావేశంలో రిటైర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, విఠల్, మాజీ జస్టిస్ నరసింహరెడ్డి, మాజీ సీఎస్ రత్నప్రభా పాల్గొన్నారు.


"ఆగస్ట్ 6న ప్రజా సమస్యలపై బహిరంగ సభ నిర్వహిస్తాం. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలను పుస్తకరూపంలో తీసుకొస్తాం. తెలంగాణ ఎలా ఉండాలనే దానిపై సూచనలు వచ్చాయి. విశ్వ విద్యాలయాలను కేసీఆర్ ఖతం చేశారు. ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతులిచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్ట్స్ చెబుతున్నారు. ధరణి సమస్యలు చాలా గంభీరంగా ఉన్నాయి. భూ సమస్యలపై శాస్త్రీయంగా అధ్యాయనం జరగాల్సిన అవసరం ఉంది." అని ఈటల స్పష్టం చేశారు.

"ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేస్తాం. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మోసం చేశారు. ఎస్టీలకు ఇస్తామన్న దళితబంధు, బీసీలకు ఇస్తున్న బంధు అయినా ఓట్ల కోసమే, సీట్ల కోసమే. రాష్ట్రం వచ్చిన నాడు రూ. 74 వేల కోట్ల అప్పు ఉండే..కానీ ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉంది.ఇప్పుడే పుట్టిన పసి బిడ్డ మీద 1లక్ష 20 వేల కోట్ల అప్పు ఉంది. నాకు ఉన్న అనుభవం తో పేద ప్రజలకు ఎలా బాగుపడలో ఆలోచన చేస్తా. ఆర్టీసీ పరిస్థితి దారుణంగా ఉంది.. వారికి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ 15 పేపర్లు లీక్ అయిన నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం." అని ఈటల అన్నారు.

Updated Date - 2023-07-23T18:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising