Bandi Sanjay: బీఆర్ఎస్, ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం: బండి సంజయ్
ABN, First Publish Date - 2023-10-29T15:36:29+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం జోరు పెంచాయి. పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం జోరు పెంచాయి. పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై టీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం అని ఆయన ఆరోపించారు. అన్న తమ్ముడు పోయి, మళ్లీ మామ అలుళ్లు అయ్యారని అన్నారు. కేటీఆర్ బీసీలకు గుణం లేదని అన్నాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవితకు గుణం ఉందా అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంజయ్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలూ ఒక్కటేనని అన్నారు. ‘‘బీఆర్ఎస్, ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం. అన్నతమ్ముడు పోయి.. మళ్లీ మామ అలుళ్లు అయ్యారు. కేటీఆర్ బీసీలకు గుణం లేదంటావా? నీ అయ్యకు, నీ చెల్లెలికి, నీకు గుణం ఉందా? మా బీసీలనే అవమానిస్తావా? నీ పొగరు అణచివేస్తాం. బీసీలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే.’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
Updated Date - 2023-10-29T15:36:29+05:30 IST