ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS MLC Kavitha: నో అరెస్ట్.. ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

ABN, First Publish Date - 2023-03-20T21:18:02+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ ముగిసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత దాదాపు 10:30 గంటల విచారణ తర్వాత రాత్రి 9:14 గంటల సమయం బయటకొచ్చారు. 9:25 గంటలకు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కాగా సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెను అధికారులు పంపించారు. సోమవారం విచారణలో పలు కీలక ప్రశ్నలను అధికారులు సంధించినట్టు తెలుస్తోంది. మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం రామచంద్ర పిళ్లైతో కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక సాయంత్రం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను ప్రశ్నించినట్టు పలు రిపోర్టులు వెలువడ్డ విషయం తెలిసిందే.

ఉదయం నుంచి అసలేం జరిగింది..!?

సోమవారం ఉదయం 10.30 గంటలకే ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొదటి అరగంటపాటు వివరాలు నమోదు, సంతకాలు తీసుకున్నాక సరిగ్గా 11 గంటలకు ఈడీ అధికారుల ఎదుట కవిత హాజరయ్యారు. 11 గంటల నుంచి సాయంత్రం 9:14 గంటలకు బయటకు వచ్చారు. కాగా సాయంత్రం సమయంలో తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. న్యాయవాదులు వెళ్లిన అరగంట వ్యవధిలోనే ఇద్దరు వైద్యులు కూడా ఈడీ ఆఫీసులోనికి వెళ్లారు. వైద్యులు ఎందుకెళ్లారు..? ఎవరికోసం వెళ్లారు..? అనే దానిపై క్లారిటీ రాలేదు.

Updated Date - 2023-03-20T21:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising