TS politics: కాంగ్రెస్ బడా నేతలపై కేసీఆర్ కన్ను!
ABN, First Publish Date - 2023-06-23T11:52:34+05:30
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తగ్గించేందుకు ఓ కార్యాచరణ రూపొందించారని సమాచారం. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో
కర్ణాటక ఫలితాల తర్వాత పుంజుకున్న కాంగ్రెస్..
ముఖ్య నేతలను ఆకర్షిస్తేనే దెబ్బ కొట్టగలమని యోచన
జానారెడ్డి, ఉత్తమ్ , జగ్గారెడ్డికి వల?
గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని రేవంత్‌కు ఆదేశం
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (CM KCR ) వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తగ్గించేందుకు ఓ కార్యాచరణ రూపొందించారని సమాచారం. వాస్తవానికి కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ( Congress leaders) రోజురోజుకు పుంజుకుంటోంది. పలువురు బీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. వీళ్లే కాకుండా పలువురు ఇతర నేతలు కూడా హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రె్‌సలో సీనియర్ నేతలుగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. వారిని కారు ఎక్కించగలిగితే.. కాంగ్రె్‌సను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో తాము అంతర్గతంగా చర్చల్లో ఉన్నామని, వారు త్వరలోనే తమ పార్టీలో చేరుతారని బీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొదటి నుంచి విభేదిస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో బహిరంగంగానే వారు రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. కొద్దినెలల కిందట సునీల్ కనుగోలు కార్యాలయంపై రాష్ట్ర పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై దుష్ప్రచారం చేసేందుకు జరుగుతున్న తతంగమంతా బహిర్గతమైందని ఉత్తమ్ ఆరోపించారు. రేవంత్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సోనియాకు ఉత్తమ్ లేఖ రాసినట్లు సమాచారం. తనలాంటి సీనియర్లను అవమానించేలా పార్టీలో సంఘటనలు జరుగుతుండడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలా? వద్దా? అన్న రీతిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు జానారెడ్డి కూడా రేవంత్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరందరినీ ఆకర్షించడం ద్వారా కోలుకోలేని విధంగా కాంగ్రె్‌సను దెబ్బకొట్టవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ పొంగును ఒక్కసారిగా చల్లార్చాలని యోచిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రస్ అధిష్ఠానం కూడా ఆరా తీస్తోంది. కర్ణాటకలో విజయం తర్వాత... తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు ఎప్పటికప్పుడు రాష్ట్రం నుంచి సమాచారం తెప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని సూచించినట్లు సమాచారం. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించినట్లు తెలిసింది.
Updated Date - 2023-06-23T11:55:53+05:30 IST