CM Revanth Reddy: కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు మరో న్యాయమా?
ABN, Publish Date - Dec 16 , 2023 | 05:02 PM
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు ఓ న్యాయం ఉంటుందా అని నిలదీశారు .
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు వరి వేయవద్దని చెప్పి కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓ న్యాయం.. రైతులకు ఓ న్యాయం ఉంటుందా అని నిలదీశారు .కమీషన్ల పేరుతో రైతులను దోచుకుంటుంటే BRS ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొన్నారని.. ప్రైవేట్ కంపెనీల మెడపై కత్తిపెట్టి కేసీఆర్ వడ్లు కొనిపించారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే.. కేసీఆర్ చేసిందేమిటని సూటి ప్రశ్న వేశారు. పాలమూరు ప్రజలంటే కేసీఆర్‌కు ఎందుకంత వివక్ష అని అడిగారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదన్నారు.
గత ప్రభుత్వం రైతు పంట బీమా అమలు చేసి ఉంటే. రైతు ఆత్మహత్యలు ఉండేవి కాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. రైతు చావుకు రూ.5 లక్షల వెల కట్టారని.. రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలన్నారు. రైతు బతకడానికి ప్రభుత్వం సాయం చేయాలని.. చనిపోయాక కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు.. BRS ప్రభుత్వ హత్యలు కాదా అని అడిగారు. గత పాలకులు రైతును రాజుగా చేస్తే పరిస్థితి ఇలా ఎందుకుంటుందని రేవంత్ అన్నారు. రైతులు చనిపోతుంటే.. రైతు ప్రభుత్వం ఎలా అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఫోన్‌లో కూడా మాట్లాడే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉండేది కాదన్నారు. తెలంగాణ మాజీ సీఎంపై ఉన్న కేసులు ఎన్ని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని.. తెలంగాణ ఉద్యమకారులపైనా కేసులను తొలగించలేదని ఆరోపించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలను ప్రజాభవన్‌లోకి అనుమతించామని గుర్తుచేశారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో లేదని.. ప్రతిపక్షంలో ఉండి కూడా BRS ప్రజలను మభ్యపెడుతోందని రేవంత్ మండిపడ్డారు.
మరోవైపు బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్‌పై విచారణ ఎందుకు అటకెక్కిందని.. సిట్ ఎక్కడకు పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. BRS పాలనలో హైదరాబాద్ డ్రగ్స్‌కి అడ్డాగా మారిందని ఆరోపించారు. డ్రగ్స్ విచారణలో BRS ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్నారు. వచ్చే పదేళ్లు తాము పాలించబోతున్నామని.. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో కాంగ్రెస్ చాలా సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకురావాలంటే కాళ్లు వణకాలని సీఎం రేవంత్ అన్నారు. గంజాయి మత్తులో ఎన్నో హత్యలు జరిగాయని.. డ్రగ్స్ వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని రేవంత్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 16 , 2023 | 06:35 PM