ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komati Reddy: వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుంచే పోటీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-04-22T20:19:06+05:30

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘నిరుద్యోగ నిరసన దీక్ష’పై తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘నిరుద్యోగ నిరసన దీక్ష’పై తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) తెలిపారు. దీక్ష గురించి తనతో ఎవరూ మాట్లాడలేదని, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) మాత్రం ఫోన్‌లో ఈ విషయం చెప్పారని పేర్కొన్నారు. తాను ఖచ్చితంగా నల్లగొండ నుంచే పోటీ చేస్తానని, అన్ని వర్గాల ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను 20 సంవత్సరాల పాటు నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు సేవలందించానని, ఎమ్మెల్యేగా లేకున్నా ఇక్కడి ప్రజలు ఆపదలో ఉంటే సేవలందిస్తున్నానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

నల్లగొండ (Nalgonda)ను దత్తత తీసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్‌ (CM KCR) గజ్వేల్‌లో ఇల్లు కట్టించిన విధంగా నల్లగొండలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు (Double bedroom houses) ఎందుకు కట్టడం లేదని కోమటిరెడ్డి నిలదీశారు. నల్లగొండలో ప్రధాన రోడ్డు వేయగానే అభివృద్ధి అంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ను అందజేస్తామన్నారు. సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలలో 98 శాతం పేదలే ఉన్నారని, ఈ విషయం తెలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్‌ను కల్పించారని గుర్తు చేశారు. 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా ఇంతవరకు హామీ నెరవేర్చలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-04-22T20:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising