పత్తి లారీ దగ్ధం

ABN , First Publish Date - 2023-06-08T00:28:44+05:30 IST

మండలంలో ని నార్కట్‌పల్లి రోడ్డులోని రావిగూడెం గ్రామ శివారులో కార్మికనగర్‌(వడ్డెరిగూడెం) వద్ద షార్ట్‌సర్క్యూట్‌ తో పత్తి లారీ దగ్ధమైంది.

 పత్తి లారీ దగ్ధం
మంటలను ఆర్పివేస్తున్న రైతులు

పత్తి లారీ దగ్ధం

మునుగోడు రూరల్‌, జూన 7: మండలంలో ని నార్కట్‌పల్లి రోడ్డులోని రావిగూడెం గ్రామ శివారులో కార్మికనగర్‌(వడ్డెరిగూడెం) వద్ద షార్ట్‌సర్క్యూట్‌ తో పత్తి లారీ దగ్ధమైంది. ఈ ప్రమాదం బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చొల్లేడు గ్రామానికి చెందిన వంగూరు శేఖర్‌ అనే వ్యా పారి రైతుల దగ్గర కొనుగోలు చేసిన పత్తిని ఏపీ 07 టీ 5067 గల లా రీలో సుమారు 90 క్వింటాళ్ల పత్తిని మునుగోడు నుంచి వరంగల్‌కు తరలిస్తున్నాడు. నార్కట్‌పల్లి రోడ్డులోని రావిగూడెం గ్రామ శివారులో వడ్డెరిగూడెం వద్ద విద్యుత తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన లారీడ్రైవర్‌ చుట్టుపక్కల రైతుల సహాయంతో నీళ్లు జల్లించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు ఫైరింజన వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే లారీ క్యాబినతో పాటు పది క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. విషయం తెలుసుకు న్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, డీటీ నరేష్‌, సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు రూ.2లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తహసీల్దార్‌ నరేష్‌ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోవడం పత్తి పూర్తిగా దగ్ధం కాకపోవడంతో పత్తి వ్యాపారికి భారీ నష్టం తప్పింది.

Updated Date - 2023-06-08T00:28:44+05:30 IST