ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CP CV Anand: ప్రశాంతంగా హనుమాన్ శోభాయాత్ర.. అందుకే ఎమ్మెల్యే రాజాసింగ్ గృహనిర్భంధం

ABN, First Publish Date - 2023-04-06T18:48:18+05:30

హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రశాంతంగా జరిగిందని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రశాంతంగా జరిగిందని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. శోభాయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. 10 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారమని, డ్రోన్ కెమెరాలు, సీసీఎంబీ ద్వారా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేశామన్నారు.

ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఎమ్మెల్యే రాజాసింగ్ గృహనిర్భంధం చేశామని, శ్రీరామనవమి రోజు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారని, అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతో రాజాసింగ్ను అడ్డుకున్నామని సీపీ వెల్లడించారు. గౌలిగూడ రామ్మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అశోక్నగర్కు చేరుకుందని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Rajasingh)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నా కూడా రాజాసింగ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రెండు రోజుల క్రితం రాజాసింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ రాజాసింగ్ తన తీరును మార్చుకోలేదు. తాజాగా రాజాసింగ్ చేసిన మరో స్పీచ్‌పై కేసు నమోదు అయింది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఎస్సై వీర బాబు ఫిర్యాదు చేశారు. దీంతో రాజా‌సింగ్‌పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-04-06T18:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising