ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2023-05-14T21:02:17+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి జయంతి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి జయంతి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. కొండపైన ప్రధానాలయం, విష్ణుపుష్కరిణి, శివాలయంతో పాటు కొండకింద అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని ప్రధానాలయం, విష్ణుపుష్కరిణి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో సంప్రదాయరీతిలో పంచామృతాలతో అభిషేకించారు. సింధూరం, వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో తమలపాకులతో అర్చించి వడపప్పు, బెల్లంపానకం, బూరెలు, వడ ప్రసాదాలు నివేదించి వితరణ జరిపారు. హనుమజ్జయంతి వేడుకల్లో భాగంగా ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి పంచామృతాభిషేకం జరిపి లక్ష తమలపాకులతో ఆంజనేయుడి సహస్రనామాలతో అర్చకుల, వేదపండితులు నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు.

భక్తుల రద్దీ.. నిత్య పూజలు

యాదగిరికొండపైన భక్తుల (Devotees) రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో భక్తజనులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొండకింద లక్ష్మీఫుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు.. ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గుండా దేవదేవుడి దర్శనాలకు కోసం ఉభయ దర్శన క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 45వేల మందికి పైగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా రూ.50,39,678 ఆదాయం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పట్టణంలో, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధులు భక్తుల సంచారంతో సందడిగా కనిపించాయి. స్వామి సన్నిధిలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిసాయి. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.

Updated Date - 2023-05-14T21:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising