రజకుల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం : భూపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-03-20T00:41:59+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

రజకుల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం : భూపాల్‌రెడ్డి
నల్లగొండ టౌన, మార్చి 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాగర్‌రోడ్డులో గల రజక భవనలో చాకలి ఐలమ్మ రజక సంఘం ఆఽధ్వర్యంలో పొదుపు చేసుకుంటున్న వారికి ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి 250 ఇస్ర్తీ పెట్టెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రజకులకు ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.3 ల క్షలు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం రూ.55 లక్షలతో మోడ్రన దోబీఘాట్లు ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. మరో రూ. 2కోట్ల వ్యయంతో మరో మోడ్రన దోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నా రు. కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకరాజు చెన్నయ్య, కన్వీన న పగిళ్ల సైదులు, గోలి శం కర్, చిలుకరాజు సతీష్, గడ్డం రాములు, భీమనపల్లి నగేష్, చర్లపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.