ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP- BJP Alliance: టీడీపీతో పొత్తుపై బీజేపీలో చర్చ.. తేల్చిచెప్పిన ఇంద్రసేనారెడ్డి

ABN, First Publish Date - 2023-01-13T16:52:33+05:30

టీడీపీ (TDP)తో పొత్తుపై బీజేపీ (BJP)లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీడీపీ (TDP)తో పొత్తుపై బీజేపీ (BJP)లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) తేల్చిచెప్పారు. బీజేపీ, టీడీపీ పొత్తులపై తరుణ్ ఛుగ్ (Tarun Chugh) ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఆర్ఎస్ (BRS) ను ఇంటికి పంపేందుకు.. బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు 12 లోక్‌సభ స్థానాల్లో కాషాయజెండా ఎగురువేయాలని బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు చేరికలను వేగవంతం చేయాలని అధిష్ఠానం భావిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ (Congress) నుంచి చాలామంది కీలక నేతలు పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. వైఎస్సార్టీపీ బలపడితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు దెబ్బపడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే షర్మిలకు అండగా నిలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెబుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై ఆలోచిస్తున్నామన్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రస్తుతం దృష్టి సారించామని, ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 11 వేల సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 9 వేల శక్తి కేంద్రాలతోపాటు మరో మూడు వేల ప్రాంతాల్లో ఈ సభలు ఉంటాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే సభలకు కేంద్ర మంత్రులు హాజరవుతారన్న తరుణ్‌ ఛుగ్‌.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మరిన్ని పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు.

Updated Date - 2023-01-13T16:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising