ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jangaon: అజ్ఞాతం వీడిన బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు

ABN, First Publish Date - 2023-02-03T16:56:03+05:30

అధికార బీఆర్‌ఎస్‌ (BRS)లో మునిసిపల్‌ ముసలం పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మునిపిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో అసంతృప్తి జ్వాలలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: అధికార బీఆర్‌ఎస్‌ (BRS)లో మునిసిపల్‌ ముసలం పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మునిపిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మేయర్లు, చైర్‌పర్సన్ల (Mayors Chairpersons)పై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, (Jangaon Municipal Chairperson,Vice Chairman) బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ వైఖరిని నిరసిస్తూ 11 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. ఇప్పుడు అసమ్మతి కౌన్సిలర్లు అజ్ఞాతం వీడారు. కలెక్టర్ శివలింగయ్య (Collector Shivalingaiah)ను కౌన్సిలర్లు కలిశారు. మున్సిపల్ చైర్మన్ పోకల జమునపై అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్లు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) అనుచరులు, అసమ్మతి కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపారు. వారిని చర్చలు ఫలించాయి. మెుత్తం 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ శివలింగయ్యకు కౌన్సిలర్లు అందజేశారు. సంతకాలు చేసిన 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లున్నారు.

జనగామ కౌన్సిలర్ల క్యాంపు మేడారానికి..

జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ వైఖరిని నిరసిస్తూ 11 మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. ఆ ముగ్గురిని పదవుల నుంచి తొలగించే వరకు క్యాంపు నుంచి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి లంచ్‌కు ఆహ్వానించినా వెళ్లకుండా తమ క్యాంపును భువనగిరి నుంచి మేడారానికి మార్చారు. అధికార బీఆర్‌ఎస్‌లో మునిసిపల్‌ ముసలం పుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మునిపిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మేయర్లు, చైర్‌పర్సన్లపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ప్రస్తుతం చైర్మన్లు, మేయర్లుగా ఉన్నవారి పదవీకాలం మూడేళ్లు పూర్తయినందున.. వారిని తొలగించి తమకు అధికార పీఠం అప్పగించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘మూడేళ్ల’ నిబంధనను ఉపయోగించుకుంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లోని తొమ్మిది పురపాలికల్లో అసంతృప్తులు అవిశ్వాసానికి సంబంధించి అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా చాలా చోట్ల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. మునిసిపాలిటీల్లో ఈ అసంతృప్తుల లొల్లి అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Updated Date - 2023-02-03T16:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising