Eetala: బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారు.. కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం
ABN, First Publish Date - 2023-11-12T12:47:20+05:30
అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.
సిద్దిపేట: అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు. ఉద్యమ నాయకుడు చేతిరెడ్డి లింగారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్(Dharani Portal) తీసుకువచ్చి భూములపై హక్కులు లేకుండా చేశారని ఆరోపించారు.
తాను గజ్వేల్‌లోని ఏ గ్రామంలో పర్యటించినా అధికార పార్టీ నేతలు భూములు లాక్కున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లు కూడా లాక్కుంటారని విమర్శించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-12T12:47:21+05:30 IST