ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etala Rajender: మాజీమంత్రి ఈటల సంచలన కామెంట్స్.. రాష్ట్రాన్ని కన్నీళ్ల తెలంగాణ చేశారు..

ABN, First Publish Date - 2023-11-18T11:21:20+05:30

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బాధలు, కన్నీళ్ల తెలంగాణాను అందించారని బీజేపీ ఎన్నికల నిర్వహణ

- బీఆర్‌ఎస్‌ డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయండి

- కార్నర్‌ మీటింగ్‌లలో ఈటల రాజేందర్‌

కుత్బుల్లాపూర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బాధలు, కన్నీళ్ల తెలంగాణాను అందించారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌(Etala Rajender) అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌, గాజులరామారంలోని చంద్రగిరినగర్‌లో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌తో కలిసి శుక్రవారం స్ర్టీట్‌ కార్నర్‌ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రజలను నమ్ముకోలేదని, డబ్బులను నమ్ముకున్నాడని అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని 100కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమయ్యారని, వారు డబ్బు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని ప్రజలను కోరారు. బస్తీ ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదని, పేదలు గుడిసెలు వేసుకున్న భూములను లాక్కొని, పేద్దోళ్లకు కట్టపెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రధానమంత్రి నాలుగు హామీలు చెప్పమన్నారన్నారు. కుటుంబ పెద్దకు బీజేపీ రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ అందిస్తుందని, పేద వారికి 60 గజాల స్థలం లేదంటే డబుల్‌ బెడ్‌రూం, అర్హులైన వారికి తెల్లరేషన్‌ కార్డులు అందిస్తామని అన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్‌ ప్రజలకు సేవ చేసి వారి ఋణం తీర్చుకుంటానన్నారు.

Updated Date - 2023-11-18T11:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising