ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Vs Etela: ఈటల ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలి: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-04-23T19:05:22+05:30

మునగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ రూ. 25 కోట్లు ఇచ్చారని ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: మునగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ రూ. 25 కోట్లు ఇచ్చారని ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender) చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan Reddy) డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ (CM KCR), మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావుకు ఉన్న ఆస్తులు, ఆప్పులు ఎన్ని? ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) లిక్కర్‌ స్కాం విషయంలో కవిత ఇక జైలుకే అంటూ ప్రకటనలు చేస్తూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. దేశంలో ఇప్పుడు లిక్కర్‌ స్కాం పరిస్థితి టీవీ సీరియల్‌లాగా మారిందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మ వారిపై ప్రమాణం చేస్తానని, దమ్ముంటే అక్కడికి వచ్చి నిరూపించాలని ఈటలకు సవాల్‌ చేశారు. అన్నట్లుగానే, శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీ కార్యకర్తలతో భారీ కాన్వాయ్‌ నడుమ చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. తొలుత దేవాలయంలో పూజలు చేశారు. అయితే ఈటల ఆలయానికి రాలేదు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రూ.25 కోట్లు ఇచ్చారనే విషయం బహిరంగ రహస్యమే. కాంగ్రెస్‌ నేతలే ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. అయినా ఉన్నమాటంటే రేవంత్‌ రెడ్డికి ఉలుకెందుకు?’’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-04-23T19:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising