NTR CoinS: కోసం పోటీ పడుతున్న అభిమానులు
ABN, First Publish Date - 2023-08-29T17:10:44+05:30
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని( NTR Coin) ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా వంద రూపాయిల నాణాన్ని( NTR Coin) ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. కాగా నేటి నుంచి ఎన్టీఆర్ స్మారక నాణేల అమ్మకాలు హైదరాబాద్ నగరంలోని మింట్ మ్యూజియంలో ప్రారంభమయ్యాయి. ఈ నాణేన్ని చేజిక్కించుకోవడం కోసం అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు ఎన్టీఆర్ నాణేల కోసం భారీగా తరలి వస్తున్నారు. అభిమానులు వేలాదిగా తరలి వస్తుడడంతో అక్కడి పరిసరాలు సందడిగా మారాయి. మింట్ మ్యూజియం దగ్గరి నుంచి కొద్ది మీటర్ల వరకు క్యూలైన్లు అభిమానులతో నిండిపోయాయి. ఎంతసేపయినా క్యూలైన్లలో నిలబడి తమ అభిమాన నేత కాయిన్‌ని తీసుకునే వెళ్తామని అభిమానులు చెపుతున్నారు.
Updated Date - 2023-08-29T17:10:44+05:30 IST