Hussain Sagar: సాగర తీరాన స్వరజల్లులే
ABN , First Publish Date - 2023-02-10T02:51:49+05:30 IST
పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు హైదరాబాద్, హుస్సేన్‌సాగర్‌లో సరికొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. సంగీతానికి అనుగుణం గా నీళ్లు నాట్యం చేస్తున్నాయా.. అని అనిపించేలా చేసే ఫ్లోటింగ్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ సాగర్‌లో ఆవిష్కృతమైంది.

హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్
మ్యూజికల్ ఫౌంటైన్
ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 9 : పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు హైదరాబాద్, హుస్సేన్‌సాగర్‌లో సరికొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. సంగీతానికి అనుగుణం గా నీళ్లు నాట్యం చేస్తున్నాయా.. అని అనిపించేలా చేసే ఫ్లోటింగ్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ సాగర్‌లో ఆవిష్కృతమైంది. దాదాపు రూ.17 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌంటెయిన్‌ను పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి, సాగర్ బోటు షీకారులోనూ ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శనను తిలకించవచ్చు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు సార్లు మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనల సంఖ్య పెంచుతామని వివరించారు.