Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
ABN, First Publish Date - 2023-04-10T20:02:55+05:30
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో సోమవారం తెల్లవారు జామున ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో సోమవారం తెల్లవారు జామున ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి చేతిలో ఓ బ్యాగును పరిశీలించగా... దానికి బంగారాన్ని స్కూృల రూపంలోకి మార్చి బ్యాగుకు అమర్చాడని, వాటిని బయటకు తీసి తూకం వేయగా 500 గ్రాముల బరువు ఉందని అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు 30 లక్షల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-10T20:02:55+05:30 IST