TS Schools : విద్యార్థులకు తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్.. అదేంటో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-22T21:59:40+05:30 IST
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) గంట వ్యవధిలోనే రెండు శుభవార్తలు చెప్పారు. శనివారం రాత్రి దివ్యాంగులకు పెన్షన్ (Pension For Disabled Persons) వెయ్యి రూపాయిలు పెంచి మొత్తం రూ. 4,016 ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గంట వ్యవధిలోనే..
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) గంట వ్యవధిలోనే రెండు శుభవార్తలు చెప్పారు. శనివారం రాత్రి దివ్యాంగులకు పెన్షన్ (Pension For Disabled Persons) వెయ్యి రూపాయిలు పెంచి మొత్తం రూ. 4,016 ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గంట వ్యవధిలోనే విద్యార్థులకు గులాబీ బాస్ తీపి కబురు చెప్పారు. తెలంగాణలోని గురుకులాల్లో డైట్ చార్జీలను (Gurukul Diet Charges) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. పలు శాఖలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లలోనూ డైట్ చార్జీలు పెరిగాయి. ఈ డైట్ చార్జీలన్నీ జూలై నెల నుంచే అమలు కానున్నాయి. ఈ మేరకు శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైట్చార్జీల పెంపుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేసీఆర్‌చిత్రపటానికి పలు జిల్లాల్లో పాలాభిషేకాలు చేస్తున్నారు.
పెరిగిన డైట్ చార్జీల వివరాలు ఇవీ..
3వ తరగతి నుంచి 7 వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న రూ.950 ల డైట్ చార్జీలు రూ.1200 లకు పెరిగాయి.
8వ తరగతి నుంచి 10వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి.
11వ తరగతి నుంచి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి.
ఎలక్షన్ ముందే..!
కాగా.. శనివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు పెన్షన్ పెంపు, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచుతున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే డైట్ చార్జీల పెంపునకు సంబంధించి జీవో ఇవ్వకుండా కేవలం ప్రెస్‌నోట్ మాత్రమే రిలీజ్ చేయడం గమనార్హం. సీఎంఓ నుంచి ప్రెస్‌నోట్ మాత్రమే రిలీజ్ చేసి ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వం ఆపింది. దీంతో అసలు పెంపు ఉందా లేదా అనేదానిపై విద్యార్థుల్లో కాసింత గందరగోళం అయితే నెలకొంది.