ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindu Ekta Yatra in Karimnagar: హిందూ ఏక్తా యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదు: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2023-05-14T20:53:20+05:30

హిందూ ఏక్తా యాత్ర (Hindu Ekta Yatra) ఎవరికీ వ్యతిరేకం కాదని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ప్రకటించారు. పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హిందూ ఏక్తా యాత్ర (Hindu Ekta Yatra) ఎవరికీ వ్యతిరేకం కాదని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ప్రకటించారు. పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా కరీంనగర్‌ (Karimnagar)‌లో హిందూ ఏక్తా యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో ఓడిపోతే హిందుత్వం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలవగానే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారని, 15 నిమిషాలు అవకాశం ఇస్తే హిందువుల సంగతి చూస్తాం అంటున్నారని విమర్శించారు. హిందుత్వం లేకుంటే భారతదేశమే ఉండేది కాదన్నారు. సెక్రటేరియట్‌లో నల్లపోచమ్మ గుడి స్థలం వాటా ఎంత? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. జగిత్యాల ఎస్‌ఐని ఎంఐఎం (MIM) నేతలు సస్పెండ్ చేయించారని విమర్శించారు. ఎంఐఎం మెడికల్ కాలేజీలో ఉగ్రవాది పట్టుబడ్డాడని బండి సంజయ్‌ తెలిపారు.

తెలంగాణలో రామరాజ్యం రానున్నది

తెలంగాణలో రజాకార్ల రాజ్యం ముగియనుందని, త్వరలోనే తెలంగాణలో రామరాజ్యం రానున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జోస్యం చెప్పారు. ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నారని, అది త్వరలో ఆగిపోనుందన్నారు. త్వరలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి రానుందని తెలిపారు. లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీశారని హిమంత బిశ్వశర్మ విమర్శించారు.

కాషాయమయమైన కరీంనగర్‌

కరీంనగర్‌లోని ప్రధాన కూడళ్లను కాషాయమయం చేశారు. పెద్ద ఎత్తున ప్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థల బాధ్యులు మజ్జిగ, మంచినీరు, ప్రసాద వితరణలు చేపట్టనున్నారు. యాత్రను అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటిస్తూ విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు కోరారు. మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రంలోనే కరీంనగర్‌ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. వివిధ వర్గాలకు చెందిన అధికారులు బందోబస్తు చర్యలను చేపట్టనున్నారు. యాత్ర జరిగే వరకు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు తీసుకోనున్నారు. నాయకులు, కార్యకర్తలు అధికారులకు సహకరించాలని సూచించారు. నిర్వాహకులు సైతం యాత్రను శాంతియుతంగా, సంయమనంగా జరుపుకొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించినట్లు సమాచారం.

Updated Date - 2023-05-14T20:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising