ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HYD: బీఆర్ఎస్‏కు భారీ షాక్... ‘కారు’ దిగిన సీనియర్లు.. అదేబాటలో మరికొందరు..?

ABN, First Publish Date - 2023-10-18T07:30:02+05:30

గ్రేటర్‌లో బలంగా ఉన్నామనుకుంటోన్న బీఆర్‌ఎస్‌(BRS) పరిస్థితి రోజురోజుకూ మారుతోంది. పలు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు,

- ఇప్పటి వరకు కాంగ్రెస్‎లోకి ఐదుగురు కార్పొరేటర్లు

- మాజీ కార్పొరేటర్లదీ అదే దారి

- తాజాగా కార్పొరేటర్‌ దంపతులు

- మైనంపల్లితో పాటు ఇద్దరు

మహా నగరంలో బీఆర్‌ఎస్‌ను నేతలు వీడుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి(Sherilingampally) నియోజకవర్గానికి చెందిన మాదాపూర్‌, హఫీజ్‌పేట కార్పొరేటర్‌ దంపతులు జగదీశ్వర్‌గౌడ్‌, పూజితగౌడ్‌ హస్తం గూటికి చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇది నియోజకవర్గంలో అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న రెండు డివిజన్లతో పాటు.. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ జగదీశ్వర్‌గౌడ్‌కు సత్సంబంధాలున్నాయి.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో బలంగా ఉన్నామనుకుంటోన్న బీఆర్‌ఎస్‌(BRS) పరిస్థితి రోజురోజుకూ మారుతోంది. పలు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కీలక నేతలు కారు దిగుతున్నారు. అధికార పార్టీ బుజ్జగించేందుకు చేస్తోన్న ప్రయత్నాలు కొందరు నేతలు ఖాతరు చేయడం లేదు. జగదీశ్వర్‌ కాంగ్రె్‌సలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జగదీశ్వర్‌ను పిలిచి మాట్లాడారు. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా నియమించారు. అయినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్‌ నుంచి మంచి ఆఫర్‌ రావడం వల్లే ఆయన చేరారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ముగ్గురు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 56 స్థానాల్లో విజయం సాధించింది. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి గతంలోనే కాంగ్రె్‌సలో చేరగా.. తాజాగా జగదీశ్వర్‌గౌడ్‌ దంపతులు బీఆర్‌ఎస్ ను వీడారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Malkajgiri MLA Mainampally Hanmantha Rao)తోపాటు ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌, మచ్చబొల్లారం కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎ్‌సను ఐదుగురు కార్పొరేటర్లు వీడగా.. రెండు దఫాలుగా బీజేపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సంఖ్య కౌన్సిల్‌లో 56గా ఉంది. అలాగే, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, ఆయన సతీమణి, బీఎన్‌రెడ్డి నగర్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కూడా ఇటీవల హస్తం గూటికి చేరారు. ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలని భావించిన రాగిడి లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్టు సమాచారం. టికెట్‌ ఇస్తే కాషాయ కండువా కప్పుకోవచ్చని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలూ రాగిడితో టచ్‌లో ఉన్నారని తెలిసింది. అంబర్‌పేట నియోజకవర్గం ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డిని గెలిపించేందుకే అధిష్ఠానం బీఆర్‌ఎస్‌ టికెట్‌ కాలేరు వెంకటే్‌షకు ఇచ్చిందని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఇక్కడ బీజేపీని గెలిపించాలన్న కేసీఆర్‌ ఆకాంక్షను నెరవేరుస్తామని కాలేరును ఓడించేందుకు తామంతా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-18T07:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising