ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: విజయశాంతి

ABN, First Publish Date - 2023-05-24T22:30:04+05:30

సీఎం కేసీఆర్ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో రామాలయం భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్(CM KCR) బీజేపీ మహిళా నేత విజయశాంతి(BJP Leader VijayaShanthi)ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) షాబాద్ మండలం (Shabad Mandal) సీతారాంపూర్‌(Seetharapur)లో రామాలయం(Ramalayam) భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు. కోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా రామాలయానికి భక్తులు సమర్పించిన సుమారు 11 వందల ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా ఇండస్ట్రియల్ పార్కు(Industrial Park)కు అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో గులాబీ నేతల భూకబ్జాలు, ఆక్రమణలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని విజయశాంతి విమర్శించారు. కనీసం సేకరించిన భూమికి పరిహారం విషయం కూడా ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పూజలు, యాగాలు కేవలం పొగడ్తలే తప్ప దేవుడిపై ఏమాత్రం గౌరవం లేవని స్పష్టమవుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దేవుళ్ల పేరు చెప్పి దేవాలయాల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శించారు.

Updated Date - 2023-05-24T22:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising