Hyderabad CP CV Anand: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
ABN, First Publish Date - 2023-07-09T19:03:58+05:30
ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahakali) అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) దర్శించుకున్నారు.
సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahakali) అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించానని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ బోనాల జాతరకు 1200 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. మహంకాళి ఆలయ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని, భక్తులందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరుపుకోవాలని సీవీ ఆనంద్ సూచించారు.
Updated Date - 2023-07-09T19:04:08+05:30 IST