ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Medigadda : ‘మేడిగడ్డ’ది పిచ్చి తుగ్లక్‌ డిజైన్‌.. కేసీఆర్‌పై చర్యలేవీ..!!

ABN, First Publish Date - 2023-11-18T10:59:54+05:30

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) పిల్లర్లు కుంగడ, గతంలో కన్నెపల్లి పంపుహౌజ్‌

- ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి..

- తెలంగాణ సమాఖ్య చర్చావేదికలో నిపుణుల డిమాండ్‌

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) పిల్లర్లు కుంగడ, గతంలో కన్నెపల్లి పంపుహౌజ్‌ మునగడం వెనక ఏ కుట్ర లేదని, కేవలం మానవ తప్పిదం, పిచ్చి తుగ్లక్‌ డిజైనే కారణమని పలు రంగాల నిపుణులు పేర్కొన్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరించినా పనికిరాదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మిగిలి ఉన్న రూ.30 వేల కోట్ల పనులను పూర్తి చేయకుండా రీడిజైన్‌ పేరుతో రూ. లక్షా 30వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. ఇందుకు కారణమైన సీఎం కేసీఆర్‌(CM KCR)పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ సమాఖ్య’ నిర్వహించిన చర్చావేదికలో తెలంగాణ ఇంజనీర్స్‌ ఫోరం కన్వీనర్‌ డి.లక్ష్మీనారాయణ, పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూ్‌పరెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి పాల్గొని ప్రసంగించారు. ప్రయోజనం లేని మేడిగడ్డపై మళ్లీ నిధులు ఖర్చు చేయటం కంటే.. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించటమే శ్రేయస్కరమని లక్ష్మీనారాయణ అన్నారు. అన్నారం బ్యారేజీ కూడా కొద్దిరోజుల్లోనే మేడిగడ్డ బ్యారేజీ తరహాలో కుంగిపోతుందని చెప్పారు. కేసీఆర్‌ ఆదేశాలతో 2018 డిసెంబరు 23న 24 గంటల్లోనే 16,722 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి రికార్డు సృష్టించడానికి పనులు చేశారని విమర్శించారు. సుబ్బారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని, మేడిగడ్డ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నిరూప్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌, ధరణి పోర్టల్‌లే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిండా ముంచనున్నాయని చెప్పారు. పాశం యాదగిరి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బక్వాస్‌ అని, మేడిగడ్డ బ్యారేజీ సహా ఇతర బ్యారేజీలన్నీ సినిమా సెట్టింగుల్లానే ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఆగమైపోయిందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదని దోపిడీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. సమావేశానికి తెలంగాణ సమాఖ్య కన్వీనర్‌ కరుణాకర్‌రెడ్డి అధ్యక్షత వహించగా సీనియర్‌ జర్నలిస్టు మామిడి సోమయ్య, కోటేశ్వరరావు, బేగ్‌, వీరబ్రహ్మం పాల్గొన్నారు.

Updated Date - 2023-11-18T11:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising