Sonia: సోనియా ప్రకటించనున్న 6 వాగ్దానాలు ఇవే..
ABN, First Publish Date - 2023-09-17T13:41:58+05:30
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చారు. పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో టి.కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ జరగనుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) 2004లో తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చారు. పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో టి.కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ (Vijayabheri Public Meeting) జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సోనియా సభా ముఖంగా 6 వాగ్దానాలను ప్రకటించనున్నారు. 1. మహాలక్ష్మి 2. రైతు భరోసా 3. రాజీవ్ యువ వికాసం 4. అంబేద్కర్ అభయ హస్తం 5. చేయూత 6. మహిళా సాధికారత.
పథకాల వివరాలు..
మహాలక్ష్మి పథకం.. 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్; రైతు భరోసా - ఎక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ; రాజీవ్ యువ వికాసం - మొదటి ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ; అంబేద్కర్ అభయ హస్తం- ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సహాయం; చేయూత- ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం; మహిళా సాధికారత- బీపిఎల్ (దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలు) కుంటుంబాల మహిళలకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సహాయం. ఈ ఆరు పథకాలను సోనియా గాంధీ ఈరోజు సభలో ప్రకటించనున్నారు.
Updated Date - 2023-09-17T14:05:45+05:30 IST