ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold Smugglers : కొత్త బంగారు దారి

ABN, First Publish Date - 2023-08-18T04:25:44+05:30

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో పెద్ద ఎత్తున బంగారం(gold) పట్టుబడింది! అనే వార్తలు తరచూ వస్తుంటాయి. కిలో.. నుంచి ఆరేడు కిలోల్లో బంగారం తరలిస్తుండగా సిబ్బంది స్మగ్లర్ల ఆట కట్టించారు అనీ చెబుతుంటారు!

తెలివి మీరిన గోల్డ్‌ స్మగ్లర్లు..

డొమెస్టిక్‌గా మారే ఇంటర్నేషనల్‌ ఫ్లైట్లే లక్ష్యంఒక టాస్క్‌ను పూర్తిచేసేందుకు ఇద్దరు వ్యక్తులు

విదేశాల నుంచి గోల్డ్‌తో ఒకరు చెన్నై లేదా ముంబైకి

అక్కడినుంచి సరుకుతో మరో వ్యక్తి హైదరాబాద్‌కు

తనిఖీ అంతంతగానే ఉండటంతో పని సులువు

రద్దీ సమయంలోనే ప్రయాణం ఉండేలా ప్రణాళిక

తరలింపునకు క్యాబిన్‌, ఫ్లైట్‌ సిబ్బంది సహకారం

నిఘా సిబ్బందిని ఏమార్చేందుకు కొత్తవారే క్యారియర్లు

శంషాబాద్‌లో కిలోల్లో పట్టుబడుతున్నా అది పిసరంతే

కొండంత బంగారం చేరాల్సిన చోటుకు సాఫీగానే

రద్దీ సమయంలో సందట్లో సడేమియాగా స్మగ్లర్లు తనిఖీల నుంచి తప్పించుకుని బయటపడుతున్నారు. అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్యనే శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటాయి. ఈ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికులతోపాటు స్మగ్లర్లు వస్తుంటారు. పక్కా సమాచారం ఉంటేగాని స్మగ్లర్లను గుర్తించి పట్టుకునేందుకు ఆస్కారం ఉండదు.

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో పెద్ద ఎత్తున బంగారం(gold) పట్టుబడింది! అనే వార్తలు తరచూ వస్తుంటాయి. కిలో.. నుంచి ఆరేడు కిలోల్లో బంగారం తరలిస్తుండగా సిబ్బంది స్మగ్లర్ల ఆట కట్టించారు అనీ చెబుతుంటారు! అయితే విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న పసిడిలో ఇది పిసరంతే అంటే నమ్ముతారా? అవును.. గోల్డ్‌ స్మగ్లర్లు(Gold Smugglers) తెలివి మీరారు. నిఘా సంస్థలు, కస్టమ్స్‌ అధికారులను ఏమారుస్తూ కొత్తదారుల్లో బంగారాన్ని అక్రమంగా స్వదేశానికి తెస్తున్నారు. ఫలితంగా అధికారులు పట్టుకుంటున్న బంగారం చిటికెడైతే పట్టుబడకుండా చేరాల్సిన చోటుకు సేఫ్‌గా చేరుతోంది దోసెడు ఉంటోంది! అదెలా సాధ్యపడుతోంది అంటారా? అయితే చదవండి!!

అంతర్జాతీయ విమానాల్లో కొన్నింటిని డొమిస్టెక్‌గా మార్చి తిప్పుతుండటం సహజం! ఈ విమానాల్లోనే బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు అనువైనవిగా ఎంచుకుంటున్నారు! తరలింపులో ఒక వ్యక్తి కాకుండా ఇద్దరు ఉంటున్నారు. ఉదాహరణకు యూఏఈ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారాన్ని తరలింపు నేరుగా జరగదు. మొదటి వ్యక్తి, తరలించాలనుకున్న బంగారంతో విమానం ఎక్కి, ముంబైలో ఖాళీ చేతులతోనే దిగుతాడు. సదరు విమానం, డొమెస్టిక్‌గా మారి హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధమవుతుంది. ముందస్తు పథకం ప్రకారం.. మొదటి వ్యక్తి, ఆ బంగారాన్ని విమానం సీటు కిందనో, వాష్‌రూంలోనో ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెడతాడు. పథకంలో భాగంగా రెండో వ్యక్తి హైదరాబాద్‌ ఫ్లైట్‌ టికెట్‌ తీసుకొని ఆ విమానం ఎక్కుతాడు. మొదటి వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దాచిన చోటు నుంచి బంగారాన్ని తీసుకొని అట్టిపెట్టుకుంటాడు. నేరుగా ఆ గోల్డ్‌తో శంషాబాద్‌లో దిగుతాడు. డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణికుల తనిఖీలు పెద్దగా ఉండకపోవడంతో సాఫీగా చెకింగ్‌ కంచెలను దాటేసుకొని గోల్డ్‌ అక్రమంగా తరలిపోతోంది. గత జూలై 30న ఇలానే జరిగింది. ఆ రోజు అబుదాబి నుంచి చెన్నైలో ల్యాండైన అంతర్జాతీయ విమానం ఆ తర్వాత డొమెస్టిక్‌గా మారి చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చింది. ఆ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 81.6 లక్షలు విలువైన 1.329 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కొత్తవారికి స్మగ్లర్ల గాలం

బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్‌, డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అనుసరించే విధానాలు పూర్తిగా తెలిసిన కేటుగాళ్లు వారికి దొరక్కుండా ఉండేందుకు ప్లాన్‌ మారుస్తున్నారు. సాధారణంగానైతే ప్రయాణికుల ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా అదే పనిగా అనుమానాస్పద రాకపోకలు సాగించే వారిపైనే కస్టమ్స్‌ నిఘా ఉంటుంది. ఈ విషయం తెలిసిన స్మగ్లర్లు, కొత్త ప్రయాణికులను క్యారియర్లుగా ఎంచుకుంటున్నారు. ఇందుకు సదరు ప్రయాణికులకు ఆకర్షణీయ ప్రయోజనాలతో ఎర వేస్తున్నారు. తాము చెప్పినట్లు చేస్తే.. విదేశీ ప్రయాణాలకు రానుపోనూ చార్జీలు ఫ్రీ అని, విదేశాల్లో పర్యాటక ప్రాంతాలనూ ఉచితంగా చూపిస్తామని, పైగా కొంత డబ్బూ ముట్టజెబుతామని గాలం వేస్తున్నారు. ఆ తర్వాతే స్మగ్లర బంగారం అక్రమ తరలింపు ‘ఆపరేషన్‌’ మొదలవుతుంది.

ఇంటి దొంగల సహకారమూ ఉంది

నిఘా కంటికి చిక్కకుండా పక్కా ప్లాన్‌తో బంగారం స్మగ్లింగ్‌ చేసే ముఠాలకు కొందరు ఇంటి దొంగల సహకారం అందిస్తున్నారు. గోల్డ్‌ అక్రమ తరలింపులో విమాన క్యాబిన్‌ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బంది సహకారంతోపాటు కొన్ని ముఠాలు ఏకంగా కొంతమంది కీలక విధులు నిర్వహించే వారి సహకారం తీసుకుంటున్నాయి. శంషాబాద్‌తోపాటు దేశంలోని ఆయా విమానాశ్రయాల్లో తరచూ ఇంటి దొంగలు పట్టుబడుతుండటమే అందుకు నిదర్శనం. శంషాబాద్‌లోనూ ఇంటి దొంగలు గతంలో పట్టుబడ్డారు. విమానాశ్రయంలోని ఓ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు బంగారం రవాణాకు సంబందిచిన కేసులో పట్టుబడగా అధికారులు వారిని విధుల నుంచి తొలగించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఇచ్చిన బ్యాగును ఓ విమానయాన సంస్థలో పనిచేసే ఉద్యోగి ఒకరు తీసుకొని దాన్ని వెంటనే విమానం నిలిపిన పక్కన ఉన్న చీకట్లోకి పడవేశాడు. దీన్ని సీసీ పుటేజ్‌లో పసిగట్టిన కస్టమ్స్‌ సిబ్బంధి అతడిని వెంబడించి పట్టుకొని విచారించారు. బ్యాగులో దాదాపు 1600 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి బొమ్మల్లో బంగారం రేకులు దాచి తెచ్చిన ప్రయాణికురాలు పట్టుబడ్డ సమయంలోనూ విమానాశ్రయంలో పనిచేసే వారి ప్రమేయం ఉన్నట్లు తేలింది.

రద్దీ ఎక్కువగా ఉంటే పండగే

రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సందట్లో సడేమియాగా స్మగ్లర్లు తనిఖీల నుంచి తప్పించుకుని బయటపడుతున్నారు. అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యనే ఎక్కువగా శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటాయి. ఈ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికులతోపాటు స్మగ్లర్లు వస్తుంటారు. పక్కా సమాచారం ఉంటేగాని స్మగ్లర్లను గుర్తించి పట్టుకునేందుకు ఆస్కారం ఉండదు. విదేశాల నుంచి లగేజీ తెచ్చే వారు రెడ్‌ చానల్‌లో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లగేజీ లేకుండా కేవలం ఒక బ్యాగుతో వచ్చే వారు గ్రీన్‌ ఛానల్‌లోంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో అనవసర ఇబ్బందులకు ఆస్కారం లేకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తుంటారు. రెడ్‌, గ్రీన్‌ చానల్‌ తనిఖీలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంటున్న స్మగ్లర్లు తమ పని సులువుగా పూర్తి చేసుకుంటున్నారు. గతంలో దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ గ్రీన్‌ ఛానల్‌ నుంచి బయటకు వెళ్తుండగా కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె వద్ద ఉన్న బ్యాగులో కొన్ని బొమ్మలతో పాటు చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. స్కానింగ్‌లో ఎక్కడా బంగారం ఉన్నట్లు చూపించడం లేదు. నిషితంగా పరిశీలించిన అధికారులు కార్బన్‌ పేపర్‌లో చుట్టిన బంగారం రేకులను గుర్తించారు.

Updated Date - 2023-08-18T05:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising