ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలి..

ABN, First Publish Date - 2023-03-17T10:05:35+05:30

స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంజయ్ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. భవిష్యత్‎లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే..అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వికారాబాద్ సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం ఫసల్ భీమా పథకం ద్వారా రైతులను ఆదు కుంటున్నప్పటికీ రాష్ట్రంలో వర్తింపజెయకుండా కేసీఆర్ పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-17T10:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising